చిరు సినిమాకు త్రిష గుడ్ బై
BY Telugu Gateway13 March 2020 7:56 PM IST
X
Telugu Gateway13 March 2020 7:56 PM IST
కీలక పరిణామం. చిరంజీవి సినిమా నుంచి హీరోయిన్ త్రిష తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషను ఎంపిక చేశారు. ఈ సినిమాకు ‘అచార్య’ అనే టైటిల్ ను ఎంపిక చేశారు. ‘కొన్ని విషయాలు తొలుత చెప్పినట్లు, చర్చించినట్లు కాకుండా భిన్నంగా మారుతున్నాయి.
క్రియేటివ్ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా. చిత్ర బృందానికి నా అభినందనలు. తెలుగు ఆడియెన్స్ ..మరోక మంచి ప్రాజెక్టుతో త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తూ’ అని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. దీంతోపాటు త్రిష స్థానంలో కొత్త హీరోయిన్ గా ఎవరు వస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Next Story