తిరుమలలో దర్శనాలకు బ్రేక్
కరోనా ప్రభావం తిరుమల వెంకటేశ్వరస్వామిపై కూడా పడింది. వారం రోజుల పాటు తిరుమలలో భక్తులకు దర్శనాలు నిలపివేస్తున్నారు. ఆలయంలో శ్రీవారికి యథాతథంగా కైంకర్యలు ఏకాంతగా నిర్వహిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. టీటీడీ అనుబంధ ఆలయల్లో కూడా భక్తులకు ప్రవేశం లేదు, నిత్య కైంకర్యాలు యథాతథంగా నిర్వహిస్తామన్నారు. ఎస్వీబీసి టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం జరిగే కార్యక్రమాలు అలాగే వుంటాయి. 1892 రెండు రోజులు కొన్ని కారణాల వల్ల మొత్తం ఆలయాన్ని మూసివేశారు.
ఇప్పటికీ వరకు తిరుమలలో వున్న భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాం. శుక్రవారం ఉదయం ఆర్జిత టిక్కెట్లు కలిగిన వారికి దర్శనం వుంటుంది. మధ్యాహ్నం నుండి భక్తులకు ప్రవేశం లేదని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే అలిపిరి టోల్ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా ఆపేశారు. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనాలను నిలిపివేయనున్నారు.