తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
BY Telugu Gateway20 March 2020 2:00 PM IST

X
Telugu Gateway20 March 2020 2:00 PM IST
తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే శనివారం నాటి పరీక్ష మాత్రం యతాతధంగా కొనసాగుతుంది. మిగిలిన పరీక్షలు అన్నింటిని రీ షెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఇది ఖచ్చితంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు షాక్ లాంటిదే. ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ముందుకెళతాయని గురువారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. 23 నుంచి జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story