Telugu Gateway
Politics

తెలంగాణలో ఒక్క రోజే పది కొత్త కరోనా కేసులు

తెలంగాణలో ఒక్క రోజే పది కొత్త కరోనా కేసులు
X

ఏప్రిల్ 15 వరకూ తెలంగాణ లాక్ డౌన్

‘ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవటానికి అయినా తెలంగాణ సర్కారు సర్వసన్నద్ధంగా ఉంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా అప్రమత్తతే అవసరం. ఇదొక్కటే సమస్యకు విరుగుడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవాళ ఒక్క రోజే పది కేసులు వచ్చాయి. అంతర్జాతీయ విమానాలు ఆగిపోయాయి. ఇక కొత్త కేసులు రావు. ఇప్పటికే ఇక్కడ ఉన్నవారిలోనే కేసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరింది. 58 మందికి వైద్యం అందిస్తున్నాం. ముందు మనం మార్చి 31 వరకూ లాక్ డౌన్ అనుకున్నాం. తర్వాత కేంద్రం మరో ప్రకటన చేసింది. దీంతో ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ తప్పదు.’ అని ముఖ్యమంత్రి కెసీఆర్ వెల్లడించారు. ఆయన శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. కెసీఆర్ విలేకరుల సమావేశంలోని ముఖ్యాంశాలు..‘మరో 20 వేల మంది హోమ్ క్వారంటైన్ లో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉన్నారు. ప్రజలకి ధన్యవాదాలు. లాక్ డౌన్ కు చాలా సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే మనం ఇబ్బంది లో పడేవాళ్ళం. ప్రపంచంలో దీనికి మందు లేదు.

ప్రపంచ దేశాలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.దీనిని అరికట్టేందుకు కేవలం స్వీయనియంత్రణ పాటించాలి. అమెరికా లాంటి దేశం కూడా ఈ వ్యాధి తో అనేక ఇబ్బందులు పడుతోంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే సోషల్ డిస్టన్స్ మాత్రమే. అమెరికా, స్పెయిన్, ఇటలీ స్థాయి లో ఇండియాలో వస్తే 20 కోట్ల మంది వ్యాధి బారిన పడుతారు అని చెప్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు దయచేసి స్వీయనియంత్రణ పాటించాలి. మనం దీన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఉదయం నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో మాట్లాడాను వారు కూడా రాష్ట్రానికి కావలసిన సహాయసహకారాలు అందిస్తాం అన్నారు. వారికి ధన్యవాదాలు. మనం ఇంకొకరి మీద ఆధారపడి ఉండకుండా వైద్యులు, నర్సులు, ఇతర ఏర్పాట్ల పై నిన్న అంత చర్చించాం. డాక్టర్లకు ,నర్సులకు ఇతర సిబ్బంది కి కావాల్సిన భోజనం,ఇతర ట్రాన్స్ పోర్టు కావాల్సినవీ అన్ని సిద్ధం చేశాం. 1400 ఐసియు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి అన్ని కూడా గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధం అవుతున్నాయి.

వెంటిలేటర్స్ కూడా 500 ఆర్డర్ ఇచ్చాము.11500 మంది ఐసో లేషన్ లో ఉంచేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 60 వేల మందికి ఈ వైరస్ సోకినా వారికి కూడా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రిటైర్డ్ డాక్టరు లు ,అందరిని గుర్తించినం,ఇతర స్టాప్ ను కూడా తీసుకుని వైద్యం అందిస్తాం. 14 వేల అదనపు డాక్టర్ల బృదం ను సిద్ధం చేస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావద్దు.దయచేసి ప్రభుత్వ, పోలీస్ ,వైద్య సిబ్బందికి సహకరించాలి. ఇది అంత చేస్తూనే ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ పై కూడా దృష్టి పెట్టాలి . తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి కూడా విజ్ఞప్తి మీకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తోంది మిరు ఇబ్బంది పడవద్దు ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టవద్దు. 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి,పంట చేతుకు వచ్చే సమయం ఇది. పంట చేతికి వస్తేనే మనం తింటాం . చాలా మంది మంత్రుల తోమాట్లాడను అందరూ కూడా ఇదే చెప్పారు ఏప్రిల్ 10 వ తేదీ వరకు నీళ్ళు ఇస్తాం. ఒక్క ఎకరం పంట కూడా ఎండ కుండ పంట పండించుకోవాలి. కూరగాయలకు ఒక్కసారి పోవద్దు దయచేసి ,ప్రజాప్రతినిధులు కూడా గుంపులు గంపులు గా వెళ్లవద్దు.

ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలికి గురికావద్దు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం కు వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు,హౌస్ బిల్డింగ్ కాకుండా ఇరిగేషన్ లో ,రైస్ మిల్లుల్లో కూడా ఎక్కడి నుండో వచ్చి పని చేస్తారు.వారికి మేము విజ్ఞప్తి చేశాం. వారికి కూలీలు ఇవ్వాలని,అ న్నం కూడా పెట్టాలని చెప్పారు .అంతేకాదు మున్సిపల్ మంత్రి తో క్రెడాయ్ వాళ్ళు కలిసి అన్నివిధాలా ఆదుకుంటాం అన్నారు. కలెక్టర్ లకు కూడా చెప్తున్నా అందరిని ఆదుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న కార్పోరేషన్ లలో చాలా మంది కూలీలు ఉన్నారు వారికి అందరికి అండగా ఉండాలి కోరుతున్నాం.వారిని ప్రభుత్వం ఆదుకోండి’ అని సూచించారు.

Next Story
Share it