తమన్నా స్వయంవరానికి ప్రభాస్
BY Telugu Gateway10 March 2020 11:05 AM GMT
X
Telugu Gateway10 March 2020 11:05 AM GMT
ఇది తమన్నా కోరిక. ఓ ఇంటర్వ్యూలో ఈ భామ ఆసక్తికర అంశాలపై స్పందించింది. మీకే స్వయంవరం పెడితే ఎవరు రావాలని కోరుకుంటారు అని ప్రశ్నించగా..ఠక్కున మూడు పేర్లు చెప్పేసింది. అందులో బాహుబలి ప్రభాస్ తోపాటు హృతిక్ రోషన్, విక్కీ కౌశల్ ఉండాలని చెప్పింది. ఆమె సినీ పరిశ్రమలోకి వచ్చి ఈ మధ్యే 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా సరే ఇంకా ఆమె జోష్ తగ్గలేదు.
వరస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు తమన్నా పెళ్ళి వార్తలు వస్తున్నా అవేమీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ మధ్య తమన్నా తల్లి మాత్రం పెళ్లి చూపులు చూస్తున్నామని తేల్చిచెప్పింది. ఏ సినిమాలోనూ లిప్ కిస్ సీన్లకు నో చెప్పే తమన్నా..హృతిక్ రోషన్ కోసం అయితే ఈ నిబంధన సడలిస్తానని సరదాగా చెబుతోంది.
Next Story