Telugu Gateway
Politics

లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలి

లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలి
X

కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. లాక్ డౌన్ ను ప్రజలు ప్రజలు సీరియస్ గా తీసుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజలు లాక్ డౌన్ పాటించేలా రాస్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు లాక్ డౌన్ అమలు పై ప్రధాని ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. మన కోసం..మనందరి కోసం లాక్ డౌన్ పాటించాలని మోడీ కోరారు. జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేసిన దేశంలో లాక్ డౌన్ విషయంలో మాత్రం కొంత తేలిగ్గా తీసుకున్నట్లు కన్పిస్తోంది. పలు చోట్ల ప్రజలు బయటకు వస్తున్నారు. ఇది ఆందోళనకర పరిణామంగా చెబుతున్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. ఏ దేశం నుంచి కూడా విదేశీ విమానాలను దేశంలోకి అనుమతించటం లేదు. ఇది కరోనా వ్యాప్తి నిరోధించేందుకు ఉపయోగపడుతుందని విశ్వాసంతో ఉన్నారు. ఈ నెలాఖరు వరకూ అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it