ఫలించిన కెసీఆర్ ప్రయత్నాలు..సీసీఎంబీలో కరోనా పరీక్షలు
BY Telugu Gateway30 March 2020 7:03 PM IST

X
Telugu Gateway30 March 2020 7:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. మంగళవారం నుంచి హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో కరోనా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం కెసీఆర్ సీసీఎంబీలో కరోనా పరీక్షలకు అనుమతించాలని కోరారు.
కెసీఆర్ వినతిని అంగీకరించిన కేంద్రం వెంటనే పరీక్షలకు మార్గం సుగమం చేసింది. సీబీఎంబీలో రోజుకు 1000 కరోనా పరీక్షలు చేసే సామర్ధ్యం కలిగి ఉంది. ప్రస్తుతం బయట ఈ సంఖ్య చాలా పరిమితంగా ఉన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో కేసుల ఫలితాలు ఎంతో వేగంగా వచ్చే అవకాశం అందుబాటులోకి వచ్చినట్లు అయింది.
Next Story