Telugu Gateway
Cinema

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరు కాగా..సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాలో సాయికు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం నాడు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తోపాటు అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ముహుర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. పలు ఫ్లాప్ ల అనంతరం సాయిధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగే, చిత్రలహరి సినిమాలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఈ హీరో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్నారు. ఇది మే 1న ఫ్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it