Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా?

ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా?
X

సస్పెన్స్ వీడింది. ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో చిత్ర యూనిట్ చెప్పేసింది. టైటిల్ ను వెల్లడించటంతోపాటు ఈ సినిమాకు సంబంధించిన తొలి మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అని తెలిపింది. ఉగాదిని పురస్కరించుకుని టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ ఒలీవియో మోరిస్ నటిస్తుండగా..మరో హీరో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా ఎపెక్ట్ కారణంగా ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి విరామం తీసుకుంటోంది.

https://www.youtube.com/watch?v=lDVQojLPI4Y

Next Story
Share it