Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డికి బెయిల్

రేవంత్ రెడ్డికి బెయిల్
X

ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి బెయిల్ లభించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఉపయోగించారనే అభియోగంతో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చగా..కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు రేవంత్ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ రోజు విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు రేవంత్ రెడ్డికి సూచించింది.

111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించిన విలాసవంతమైన ఫాంహౌస్ లో మంత్రి కెటీఆర్ ఉంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ..తన అనుచరులతో కలసి అక్కడ డ్రోన్ తో చిత్రీకరణ జరిపించారు. రేవంత్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ హైకోర్టులో వాదనలు విన్పించారు. తొలుత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను స్థానిక కోర్టు కొట్టివేయటంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Next Story
Share it