Telugu Gateway
Politics

త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతాం

త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతాం
X

తెలంగాణలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని తాము ఎప్పుడూ చెప్పలేదని..లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామన్నారు. ఇఫ్పటికే చాలా ఉద్యోగాలు ఇచ్చామని..రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేయటం, రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. దీంతోపాటు కెసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నట్లు తెలిపారు. అవసరం అయితే మద్యం ధరలు కూడా మళ్ళీ పెంచుతామని అన్నారు. తాము ఏదైనా ప్రజలకు చెప్పే చేస్తామని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు చెబుతున్నాం కాబట్టే తమకు వాళ్ల మద్దతు లభిస్తుందని అన్నారు. అబ్దదాలు చెప్పాల్సిన అవసరం తమకు ఏ మాత్రం లేదన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో అసలు మద్యం షాపులు లేనట్లు మాట్లాడుతున్నారని..తాము అప్పుడు ఏమి జరిగిందో చూడలేదా అని ప్రశ్నించారు, గతంలో మద్య నిషేధం అమలు చేస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని గుర్తుచేశారు. గ్రామాల్లో గుడుంబా బట్టీలు లేకుండా చేశామన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ బస్ చార్జీలు పెంచుతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. 2లక్షల 25 వేల కంది రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. దేశాన్ని సాకుతున్న నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు.

Next Story
Share it