Telugu Gateway
Cinema

ఆకట్టుకుంటున్న ‘రెజీనా న్యూలుక్’

ఆకట్టుకుంటున్న ‘రెజీనా న్యూలుక్’
X

రెజీనా కొత్త సినిమా నేనే నా?. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి కారణం కూడా ఉంది. ఇందులో రెజీనా రాణి లుక్ లో ఉండగా..ఇనుప మేకులు కొట్టిన గదిలో ఆమె ఉంటుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘నిను వీడని నీడను నేనే’ డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌ గా కనిపించనున్నారు. ఈ ఫస్ట్ లుక్ ను హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. తమిళ ఫస్ట్‌ పోస్టర్‌ను విజయ్‌ సేతుపతి ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

Next Story
Share it