విమానాశ్రయంలో మాస్క్ తో ప్రభాస్
ఆ వైరస్ కు బాహుబలి అయినా ఎవరైనా ఒకటే. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇందుకు ఎవరూ మినహాయింపు కారు. అందుకే బాహుబలి హీరో ప్రభాస్ కూడా విమానాశ్రయంలో మాస్క్ తో కన్పించారు. తెలంగాణలో ఓ కేసు నమోదు కాగానే అందరిలో భయం ప్రారంభం అయింది. కోవిడ్ కష్టాలు సామాన్య ప్రజలనే కాదు సినీ స్టార్లను కూడా వెంటాడుతున్నాయి. నిత్యం బిజీ షెడ్యూల్లతో ఊర్లు చుట్టే సినీతారలు వైరస్ తమను ఏవైపునుంచి అటాక్‌చేస్తుందోనని భయపడుతున్నారు.
దీంతో ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ హీరో ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎయిర్‌పోర్టులో తీసిన ఆ వీడియోలో ప్రభాస్ మాస్క్ ధరించి ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్ ’ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు.