Telugu Gateway
Cinema

విశ్వక్ సేన్ కొత్త సినిమా ‘పాగల్’

విశ్వక్ సేన్ కొత్త సినిమా ‘పాగల్’
X

‘హిట్’ సినిమా సూపర్ హిట్ తో హీరో విశ్వక్ సేన్ జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ‘పాగల్’ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా పూజా కార్యక్రమం, షూటింగ్ గురువారం నాడు లాంఛనంగా హైదరాబాద్ లో ప్రారంభం అయింది. నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

విశ్వక్ సేన్ కు ఇది ఐదవ సినిమా. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it