‘ఓరేయ్ బుజ్జిగా’ టీజర్ వచ్చేసింది
రాజ్ తరుణ్. హిట్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు అన్నీ ఫట్ అంటుంటే పూర్తి నిరాశలో మునిగిపోయాడు. ఇప్పుడు ఓరేయ్ బుజ్జిగా అంటూ ప్రేక్షకులను పలకరించుందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా హెబ్బా పటేల్, మాళవిక నాయర్ లు నటించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ ను ట్రాక్ లో పెడుతుందో లేదో వేచిచూడాల్సిందే. మార్చి 25న ఈ సినిమా విడుదల కానుంది.
కొండా విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’, ‘అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏమిటి? ఒక ఫ్లిప్‌కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్‌మైషో, ఒక క్రెడిట్ కార్డ్’ అంటూ టీజర్‌లో వచ్చే డైలాగ్‌లు సరదాగా ఉన్నాయి. ‘బాధకు బ్రాండ్స్ తో పనేంటి డాడీ’, ‘నీకు తెలిసిన స్టోరీలో తెలియన్ ట్విస్టు ఉంది’ అంటూ చివర్లో వచ్చే డైలాగ్‌లు కూడా ఆకట్టుకున్నాయి.
https://www.youtube.com/watch?v=xAgNEqTBeAc