Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో మరో కరోనా కేసు..సర్కారు హై అలర్ట్

హైదరాబాద్ లో మరో కరోనా కేసు..సర్కారు హై అలర్ట్
X

తెలంగాణలో నమోదు అయిన తొలి కేసు కరోనా బాధితుడు వైరస్ తగ్గి బయటకు వెళ్లిపోయాడు. కొత్తగా మరో పాజిటివ్ కేసు వెల్లడైంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని..అతనికి గాంధీలో చికిత్స అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ తెలిపారు. మరో రెండు కేసులకు సంబంధించి ఫలితాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనాపై అసెంబ్లీలో కెసీఆర్ ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..అయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల నుంచే ఈ వైరస్ దేశంలోకి ప్రవేశిస్తుందని..దేశంలో కూడా కేసుల సంఖ్య తక్కువే అని వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోందని..శనివారం సాయంత్రం కేబినెట్ కూడా సమావేశం అయి దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తొలుత కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వెయ్యి కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేస్తానని చెప్పామని.. అవసరం అయితే 5వేల కోట్లు ఖర్చుచేస్తామని వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలపై కూడా సమీక్ష చేస్తాం..,క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Next Story
Share it