Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ హోలీ ఫోటో వైరల్

ఎన్టీఆర్ హోలీ ఫోటో వైరల్
X

ఎన్టీఆర్ హోలీ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఫ్యామిలీతో కూడిన ఫోటోను ఆయన మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుషీకుషీగా ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. అందరి కంటే ఎన్టీఆర్ భార్య ప్రణీతే కాస్త ఎక్కువ హోలీ ఆడినట్లు కన్పిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రణీతతోపాటు వాళ్ళ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తుండగా..మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ ఓలివియో మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటోపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ఎన్టీయార్ చిన్న కొడుకు గురించి కామెంట్ చేశాడు. 'ఎన్టీయార్ చిన్న కొడుకు కెమేరా వైపు చూస్తున్న విధానం ఏమి చెబుతోందంటే.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు' అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.

Next Story
Share it