Telugu Gateway
Telangana

వాళ్ళెవరికీ ప్రాణాపాయం లేదు..ఈటెల

వాళ్ళెవరికీ ప్రాణాపాయం లేదు..ఈటెల
X

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గంట గంటకూ మారుతోంది. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. శుక్రవారం ఉదయం వరకూ తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు ఉండగా..సాయంత్రానికి ఈ సంఖ్య 18కి పెరిగింది. ఇప్పటివరకు భారత్‌లో 223 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణలో శుక్రవారం మరో రెండు కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

‘ఇవాళ మరో రెండు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పద్దెనిమిది మందిలో ఎవరికి ప్రాణాపాయం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకింది. తెలంగాణలో మరో 6 కరోనా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నాం. వేల మందికి క్వారంటైన్‌ చేయగలిగేలా సన్నద్దం అయ్యాం’అని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ రాత్రి పది గంటల సమయంలో మరో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి పెరిగింది.

Next Story
Share it