Telugu Gateway
Cinema

అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్ వచ్చేసింది

అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్ వచ్చేసింది
X

‘ఓ ఇంటి ముందు మైక్ పట్టుకుని ఓ అమ్మాయి మాట్లాడుతుంటుంది. అక్కడ చీకట్లో ఎవరో ఎటాక్ చేశారు అంట. కానీ ఎవరో ఏంటో కన్పించలేదు అంటున్నారు. ఆ వెంటనే మాధవన్ ఎంట్రీతో’ మొదలవుతోంది ‘నిశ్శబ్దం’ ట్రైలర్. ఈ ట్రైలర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో అనుష్క మాధవన్‌, అంజలి, షాలిని పాండేలు కీలక పాత్రలు పోషించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చీకట్లో జరిగే దాడులపై విచారణ చేపట్టే అధికారిణిగా అంజలి కనిపించనున్నారు.

‘నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎందుకు రాలేదు?’, ‘ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు’, ‘ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?’ అనే డైలాగ్‌లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఏప్రిల్‌ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదల కానుండి. గోపి సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించగా, కోన వెంకట్‌ డైలాగ్‌​ రైటర్‌గా ఉన్నారు

https://www.youtube.com/watch?v=azUa-Qpi-Bo

Next Story
Share it