Telugu Gateway
Cinema

నిఖిల్ కొత్త సినిమా ‘18 పేజీస్’

నిఖిల్ కొత్త సినిమా ‘18 పేజీస్’
X

దర్శకుడు సుకుమార్ ది విభిన్నమైన శైలి. ఆయన సినిమా టైటిల్స్ కూడా వెరైటీగా ఉంటాయి. గతంలో కుమారి21 ఎఫ్ పేరుతో సినిమా కథను అందించిన సుకుమార్ రైటింగ్స్ సంస్థ ఇఫ్పుడు 18పేజీస్ పేరుతో తెరకెక్కనున్న సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం గురువారం నాడు హైదరాబాద్ లో జరిగింది. కుమారి 21ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాపే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే జీఏ2 ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో సినిమా రానుండగా..బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. 18పేజీస్ టైటిల్ ను చిత్ర యూనిట్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. పెళ్ళి కుదిరిన తర్వాత నిఖిల్ సినిమాల స్పీడ్ పెంచినట్లు కన్పిస్తోంది. ఓ వైపు కార్తికేయ2కు రెడీ అయిన ఈ హీరో ఈ కొత్త సినిమా షూటింగ్ కు సిద్ధం అయ్యాడు. గత ఏడాది వచ్చిన అర్జున్ సురవరం సినిమా నిఖిల్ ఖాతాలో హిట్ గా నిలిచింది.

Next Story
Share it