Telugu Gateway
Andhra Pradesh

వారసులతో ‘వారసుడి భేటీ’

వారసులతో ‘వారసుడి భేటీ’
X

ఈ భేటీ ఆసక్తికరం. అసలు ఇప్పుడు ఎందుకు జరిగింది ఈసమావేశం. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయయుడి రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్ ఎందుకు ఆకస్మాత్తుగా పార్టీకి చెందిన యువ నేతలతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. విందు సమావేశం నిర్వహించి మరీ చర్చించిన అంశాలు ఏంటి?. ఇప్పట్లో ఈ యువ నేతలు కీలక పాత్ర పోషించాల్సిన ఎన్నికలు కూడా ఏమీ లేవు. కానీ నారా లోకేష్ ఇప్పటి నుంచే తన కొత్త టీమ్ రెడీ చేసుకుంటున్నారా?. 2024 ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతల తనయులు,వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆదివారం నాడు హైదరాబాద్ లో లంచ్ సమావేశం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం పార్టీకి చెందిన సీనియర్ నేతల తనయులు ఉండటమే విశేషం. అయితే వీళ్ళదరనీ పార్టీ భావి నాయకులుగా భావించి వీళ్ళతో లోకేష్ సమావేశం అయినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ వంటి వారు కూడా ఉండటంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి.

అయితే పార్టీలోకి యువరక్తం అంటే నేతల వారసుల నుంచే కాకుండా పూర్తిగా కొత్త రక్తం కూడా ఎక్కిస్తేనే ఈ తరుణంలో టీడీపీలో జోష్ వస్తుందనే వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున బలహీనతలు..విమర్శలు ఉన్న నాయకులను ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పక్కకు తప్పించి..కొత్తరక్తం తీసుకొస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.అదే సమయంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన నాయకులను విస్మరించటం కూడా అంత తేలికైనా వ్యవహారం కాదని అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ తో పాాటు ఈ సమావేశంలో నారా బ్రాహ్మణీలు కూడా పాల్గొన్నారు. ఈ వారసుల సమావేశంలో అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు,బొజ్జల, బండారు, కోడెల తనయులతోపాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు,దేవినేని చందు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it