Telugu Gateway
Politics

మోడీ క్షమాపణలు ఎందుకు చెప్పారు?

మోడీ క్షమాపణలు ఎందుకు చెప్పారు?
X

ప్రధాని నరేంద్రమోడీ అనూహ్యంగా ఆదివారం నాడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆంక్షల వల్ల ప్రజలు, కూలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తనకు తెలుసని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ ప్రకటించాల్సి వచ్చిందని అన్నారు. ప్రజలు తమను తమను రక్షించుకోవటంతో పాటు..తమ కుటుంబాలను రక్షించుకోవటానికే ఈ లాక్ డౌన్ అన్నారు. ప్రధాని మోడీ ఆదివారం నాడు ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా మాట్లాడారు. అందులోనే ఆయన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు యావత్‌దేశ ప్రజలు తనను క్షమించాలని కోరారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రజలు సంయమనంతో ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చిరించారు. కరోనా ఒక ప్రాంతానికే చెందిన కాదని ప్రపంచం నలుమూలలా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు మోదీ గుర్తుచేశారు. ‘కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాము. దీని వల్లన ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అన్నింటికన్నా.. దేశ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం.

కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. వారి అనుభవాలను తెలుసుకుంటున్నాను. కరోనాతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. పాల్గొనడమంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. వైరస్‌ను అరికట్టడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం. లక్ష్మణ రేఖను అందరూ పాటించాల్సిందే. కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగటం కొంత ఆందోళనకరమే. దీనివల్లన అభివృద్ధి చెందిన దేశాలు కూడా కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. మానవత్వంతో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా వందనాలు. సేవాభావంతో రోగికి చికిత్స చేసే వైద్యులు ఎంతో గొప్పవారని ఆచార్య చరకుడు ఎప్పుడో చెప్పారు. వైద్యులందరికీ నా ధన్యవాదాలు. వారు అందిస్తున్న సేవలు మరువలేనివి.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it