Telugu Gateway
Telangana

సీఎంఎఫ్ఆర్ కు భారీగా విరాళాలు

సీఎంఎఫ్ఆర్ కు భారీగా విరాళాలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు గురువారం నాడు పలువురు పారిశ్రామికవేత్తలు భారీగా విరాళాలు అందజేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సాయం అందజేయానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మెగా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరక్టర్ మెగా కృష్ణారెడ్డి సీఎం కెసీఆర్ ను కలసి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. శాంతా బయోటెక్ అధినేత, పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి కోటి 116 రూపాయలు అందించారు.

కెఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహరెడ్డి తమ కంపెనీ తరుఫున కోటి రూపాయల చెక్కును సిఎంఆర్ఎఫ్ కు అందజేశారు. ఆయనతాపటు లారస్ ల్యాబ్స్ సిఇఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి తమ ల్యాబ్ తరుఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటు సిఎంఆర్ఎఫ్ కు రూ.50 లక్షల చెక్కును అందించారు.

Next Story
Share it