మారుతీరావు ఆత్మహత్య

మారుతీరావు. ఈ పేరు కొద్ది కాలం క్రితం తెలంగాణలో పెద్ద కలకలమే రేపింది. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని అల్లుడి ప్రణయ్ ని కిరాయిమూకలతో హత్య చేయించాడు. తర్వాత మారుతీరావు జైలుకెళ్ళాడు. కొద్ది కాలం క్రితమే మారుతిరావుకు బెయిల్ పై విడుదల అయ్యారు. బెయిల్ లో వచ్చిన తర్వాత కూడా పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా మారుతిరావుకు చెందిన స్థలంలో ఓ శవం దొరకటం కలకలం రేపింది. ఈ తరుణంలో హైదరాబాద్ లో ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు.
ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రే ఆయన ఆర్యవైశ్య భవన్ కు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం పంపినట్లు మారుతీరావుపై కూతురే ఫిర్యాదు చేసింది. ఓ వైపు జైలు జీవితం, మరో వైపు కూతురు దూరమవ్వటం తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.