Telugu Gateway
Cinema

మహేష్ బాబు విరాళం కోటి రూపాయలు

మహేష్ బాబు విరాళం కోటి రూపాయలు
X

ప్రముఖ హీరో మహేష్ బాబు కూడా కరోనా సహాయక చర్యల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆయన కోటి రూపాయలు అందించనున్నారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఏకతాటిపై రావాలని, ప్రభుత్వాల సూచనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా మహేశ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కరోనాపై పోరాటంలో ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా ప్రభుత్వానికి సహాయసహకారాలు అందించాలని కోరారు.

Next Story
Share it