Telugu Gateway
Andhra Pradesh

టీడీపీకి మరో షాక్..కే ఈ రాజీనామా

టీడీపీకి మరో షాక్..కే ఈ రాజీనామా
X

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేతలు అందరూ వరస పెట్టి షాక్ లు ఇస్తున్నారు. రోజుకో కీలక నేత పార్టీని వీడుతుండటంతో టీడీపీ అధిష్టానం కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాజీ మంత్రి, కర్నూలు జిల్లాలోని కీలక నేతగా ఉన్న కె ఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీకి మనుగడ లేదని వ్యాఖ్యానించారు.

మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి తాను సూచించిన వారికి టిక్కెట్లు ఇవ్వలేదనే కారణంతో ఆయన పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నారు. ఓ బిజెపి నాయకుని మాట టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నాడని కే ఈ ఆరోపించారు. త్వరలోనే ఏ పార్టీ లో చేరబోయేది ప్రకటిస్తాను అని తెలిపారు. అయితే కే ఈ అధికార వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్న తర్వాతే ఈ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు.

Next Story
Share it