Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు సింధియా గుడ్ బై..కేంద్రమంత్రివర్గంలో చోటు!

కాంగ్రెస్ కు సింధియా గుడ్ బై..కేంద్రమంత్రివర్గంలో చోటు!
X

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక కూలిపోవటమే మిగిలింది. ఆ పార్టీకి కాంగ్రెస్ సీనియర్ నేత జోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ సింధియా రాజీనామా లేఖ బయటకు వచ్చిన తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి తన పరువు తానే తీసుకుంది. ఈ పని ఏదో కాస్త ముందు చేసినe కొంత పరువు అయినా దక్కేది. కానీ అంతా అయిపోయాక రంగంలోకి దిగటమే కాంగ్రెస్ పార్టీ పనిగా మారింది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీని రోజురోజుకూ మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయనే చెప్పాలి. కాంగ్రెస్ కు రాజీనామా చేయటానికి ముందుకు జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీలతో సమావేశం అయ్యారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి సింధియా వస్తారని ప్రచారం జరుగుతోంది.

18 సంవత్సరాల పాటు కాంగ్రెస్ లో ఉన్న సింధియా అధిష్టాన వైఖరితో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆయన వర్గం నేతలు కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నారు.దీంతో మధ్యప్రదేశ్ లో బిజెపి సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతోంది. ఇప్పటికే సింధియా వర్గం ఎమ్మెల్యేలు 17 మంది కర్ణాకట క్యాంప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు కౌంటర్ గా మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తన మంత్రివర్గంతో రాజీనామా చేయించినా కూడా ఫలితం లేకుండా పోయింది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు ఆ పార్టీ రెడీ అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక సింధియా బిజెపిలో చేరటం కేవలం లాంఛనం మాత్రమే. రాహుల్ గాంధీకి సింధియా అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు.

Next Story
Share it