Telugu Gateway
Politics

బిజెపిలో చేరిన సింధియా

బిజెపిలో చేరిన సింధియా
X

కాంగ్రెస్ కు మంగళవారం నాడు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం నాడు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో ఆయన బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. సింధియా రాజీనామాతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. సింధియాతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బిజెపిలో చేరిన తర్వాత సింధియా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ఎదుర్కొనే సత్తా ప్రస్తుతమున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి సింధియా వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడమే తన అంతమ లక్ష్యమని, దాని కోసమే బీజేపీలో చేరుతున్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు తనను ఎంతో ఆకర్షించాయని చెప్పారు.

నాయకత్వలేమితో, వరస ఓటములతో, పార్టీలో కుమ్ములాటతో సతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీలో ప్రజలకు సేవచేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పార్టీని ముందుండి నడిపిస్తూ, ప్రచారాన్ని భుజానకెత్తుకుని మోస్తున్న యువతకు అధిష్టానం మొండిచేయి చూపుతోందని విమర్శించారు. మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కూడా సింధియా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను సర్కార్‌ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి చేసేందుకు బీజేపీకి తనకు అవకాశం కల్పించిందని, ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా నాయకత్వంలో దేశాభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వారి నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Next Story
Share it