వ్యభిచార గృహంలో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు

ఎన్ని విమర్శలు ఉన్నా..ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉన్నా తెలుగు నాట ‘జబర్దస్త్’ షో గురించి తెలియని వారు ఉండరు. ఆ షో అంతగా పాపులర్ అయింది. జబర్దస్త్ స్కిట్లకు సంబంధించి యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేశారంటే గంటల్లోనే లక్షల మంది ప్రేక్షకులు వీటిని వీక్షిస్తారు. విశాఖపట్నంలో పోలీసులు జరిపిన దాడుల్లో ఇద్దరు జబర్దస్త్ నటులు వ్యభిచార గృహంలో పట్టుబడటం కలకలం రేపింది. ఇందులో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిపారు.
ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు. దొరబాబు, పరదేశి హైపర్ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోలోనూ దొరబాబును ఎంతసేపూ ఆది ఆ వీడియోలు తయారు చేసే పనిలో ఉంటాడని ఆటపట్టిస్తుంటాడు. ఇఫ్పుడు నిజంగానే వ్యభిచార గృహంలో దొరబాబు దొరకటం విశేషం.