Telugu Gateway
Politics

మోడీ కీలక నిర్ణయం

మోడీ కీలక నిర్ణయం
X

దేశంలోకరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరితోకలసి ఆనందంగా జరుపుకునే పండగ హోలీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా వైరస్ ఆందోళనల దృష్ట్యా, ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు హోలీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు ట్విటర్లో ఒక సందేశాన్ని ట్వీట్‌ చేశారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామూహిక సమావేశాలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇటలీనుంచి వచ్చిన టూరిస్టులు 15 మందికి వ్యాధి సోకినట్టుగా బుధవారం నిర్ధారణ అయింది. దీంతో తాజా కేసులతో భారతదేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 18కి చేరింది.

Next Story
Share it