స్వీయ నిర్భందలోకి ప్రభాస్
BY Telugu Gateway21 March 2020 7:53 PM IST

X
Telugu Gateway21 March 2020 7:53 PM IST
కరోనా తిప్పలు అందరికీ మామూలే. ఇందులో సెలబ్రిటీలు లేరు..సామాన్యులు లేరు. ఎవరైనా సరే కరోనా పేరు చెపితే హడలిపోవాల్సిందే. అందుకే బాహుబలి హీరో ప్రభాస్ కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాడు. ఇటీవలే జార్జియా నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని వెనక్కి వచ్చిన ప్రభాస్ ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటికే ఇదే సినిమా షూటింగ్ లో పాల్గొన్న హీరోయిన్ పూజా హెగ్డెతోపాటు నటుడు ప్రియదర్శి కూడా ఇదే బాటలో ఉన్న విషయం తెలిసిందే. ప్రజలందరూ కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ప్రభాస్ పేర్కొన్నారు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే.
Next Story



