Telugu Gateway
Cinema

నితిన్ పెళ్లి వాయిదా

నితిన్ పెళ్లి వాయిదా
X

భీష్మ సినిమా హిట్ తో జోష్ లో ఉన్నాడు హీరో నితిన్. కానీ ఈ హీరో పెళ్లికి కరోనా అడ్డం వస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏప్రిల్ 16న జరగాల్సిన తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు హీరో నితిన్ ఆదివారం నాడు ప్రకటించారు. ఈ మేరకు నితిన్ ఓ సందేశం విడుదల చేశాడు. ‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్‌డౌన్‌ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను.

అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దీంతోపాటు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చుని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి కరోనాపై పోరుకు చెరో పది లక్షల రూపాయల విరాళం ఇఛ్చిన తొలి హీరో నితినే.

Next Story
Share it