Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదు

హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదు
X

కరోనా పేరు చెపితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. ఈ తరుణంలో హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదు అయింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా ఒక్కో కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది. వీళ్ళిద్దరిని సురక్షిత ప్రాంతంలో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. అదే సమయంలో ఢిల్లీలో గుర్తించిన కేసులోనూ ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చారని కేంద్రం పేర్కొంది. అయితే ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో ఇఫ్పటివరకూ మొత్తం ఐదు కరోనా కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, ఓడరేవుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలుత భారత్ లో ఒక్క కేరళలో మాత్రమే ఈ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కు సంబంధించి హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా వైద్య పరీక్షల కోసం కొత్తగా 15 లేబరేటరీలను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు చైనా, బ్యాంకాంగ్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్ళకుండా ఉంటే మంచిదని..ఈ విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

Next Story
Share it