ఈపీఎఫ్ వడ్డీ రేటులో కోత
BY Telugu Gateway5 March 2020 1:33 PM IST

X
Telugu Gateway5 March 2020 1:33 PM IST
ఉద్యోగులకు షాక్. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కోత పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పీఎఫ్ వడ్డీరేటు కుదింపుపై మార్చి 5న సమావేశమైన సమావేశమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు.
Next Story



