Telugu Gateway
Politics

తెలంగాణలో ఒక్కటే కరోనా కేసు..ఆందోళన అక్కర్లేదు

తెలంగాణలో ఒక్కటే కరోనా కేసు..ఆందోళన అక్కర్లేదు
X

దుబాయ్ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు తప్ప..తెలంగాణలో ఎవరికీ కరోనా వైరస్ లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న రెండు కేసుల్లో కూడా ఫలితం కూడా నెగిటివ్ వచ్చిందని..ఒక్క కేసు తప్ప..మిగతా అన్ని కేసుల్లోనూ నెగిటివ్ గానే తేలిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించందని ఈటెల తెలిపారు. కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి స్పష్టంచేశారు. భారత్‌లోనూ కరోనా ప్రభావం అంతగాలేదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారని అన్నారు.

రాబోయే రోజుల్లోనూ కరోనా వైరస్‌ను తెలంగాణలోకి రాకుండా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ‘కరోనాతో ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు. మాస్క్‌ లను అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా అనేది గాలితో వ్యాప్తి చెందదు. నోటి తుంపర్లు ద్వారా కళ్ళలో పడితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్‌ లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తాం. అనుమానం ఉంటే, డబ్బులు ఉంటే కరోనా టెస్టులు చేయం. వైరస్‌ లక్షణాలను డాక్టర్లు నిర్ధారిస్తేనే పరీక్షలు చేస్తాం. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు.

Next Story
Share it