Telugu Gateway
Telangana

తెలంగాణలో ఐదుకు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో ఐదుకు చేరిన కరోనా కేసులు
X

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తొలుత ఒక్క కేసు మాత్రమే ఉన్న రాష్ట్రంలో తర్వాత మూడు..నాలుగు..ఇప్పుడు ఐదుకు చేరింది. ఈ ఐదు కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం వరకూ నాలుగు పాజిటివ్ కేసులు మాత్రమే ఉండగా..మంగళవారం నాడు కొత్తగా మరో పాజిటివ్ కేసు తేలింది. ఇకపై ప్రతి రోజూ మూడుసార్లు బులెటిన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విదేశీయులను క్వారంటైన్ చేస్తున్నట్లు తెలిపారు. 221 మందిని ప్రస్తుతం క్వారంటైన్ లో పెట్టామని..వాళ్లంతా రోగుల కింద లెక్క కాదని తెలిపారు

ముందు జాగ్రత్త చర్యగా వీరిని ఓ చోట ఉంచామని వెల్లడించారు. కరోనా వైరస్ నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్,స్కాట్లాండ్, ఇండోనేషియాల నుంచి వచ్చిన వారే కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. విదేశాల నుంచి వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలంగాణ సర్కారు ఇఫ్పటికే ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు, సినిమా హాళ్లు, బార్లు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఒక వైరస్ వైరస్ బారిన పడిన యువకుడు డిశ్చార్ట్ అయినందున ఇంకా నలుగురు మాత్రమే చికిత్స పొందుతున్నట్లు లెక్క.

Next Story
Share it