Telugu Gateway
Cinema

టాలీవుడ్ పైనా కరోనా ఎఫెక్ట్

టాలీవుడ్ పైనా కరోనా ఎఫెక్ట్
X

కరోనా వైరస్ ఎఫెక్ట్ టాలీవుడ్ నూ తాకింది. సినిమా షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి. కొత్త సినిమాల విడుదల కూడా వాయిదా పడింది. ముఖ్యంగా హీరో నాని, సుధీర్ బాబులు నటించిన ‘వి’ సినిమా విడుదలను వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉగాది సందర్భంగా ఈ నెల 25న వి విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా భయంతో సినిమా విడుదల వాయిదా వేసినట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కరోనా ప్రభావం తగ్గాకే మళ్ళీ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. తెలంగాణ సర్కారు కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల22వరకూ సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

తర్వాత మళ్ళీ సమీక్షించి ఈ మూసివేతను కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు. ఆచార్యతోపాటు పలు సినిమాల షూటింగ్ లకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. భారీ సమూహంతో కూడిన సన్నివేశాలు ఉంటే షూటింగ్ లను నిలిపివేశారు. ఇప్పటికే కరోనాకు బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ కూడా ప్రభావానికి గురైంది. ఇప్పుడు టాలీవుడ్ వంతు అయింది.

Next Story
Share it