Telugu Gateway
Politics

కెసీఆర్ ఘాటు హెచ్చరికలు

కెసీఆర్ ఘాటు హెచ్చరికలు
X

రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు వరకూ కర్ఫ్యూ

అత్యవసరం అయితే 100కు డయల్ చేయండి

ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారు?

లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ‘షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆర్మీని పిలిచే పరిస్థితులు వద్దు. అందరూ కూడా దయచేసి సిన్సియర్ గా ఫాలో కావాలి. హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి పాస్ పోర్టులు సీజ్ చేయాలి. ఇంకా తప్పులు చేస్తే పాస్ పోర్టులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. కవులు కూడా మంచి కవితలు రాసి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. తెలంగాణలో కరోనా వచ్చిన వారంతా కోలుకుంటున్నారు. ఎవరికీ సీరియస్ గా లేదు. ప్రభుత్వం చర్యలు ఆపదు. ఇక నుంచి రాత్రి ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఎవరికైనా అత్యవసరం అయితే 100కు డయల్ చేస్తే వారి అటెండ్ అవుతారని చెప్పారు. అవసరం అయితే వాహన సదుపాయం కూడా కల్పిస్తారని తెలిపారు.

వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. గ్రామీణ ప్రాంతాలు కూడా కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎవరూ గుంపులు గుంపులు కాకుండా ఎవరి పని వాళ్లు చేసుకోవాలని ఆదేశించాం. వ్యవసాయ ఉత్పత్తులు అయిన వరి, మొక్క జొన్న ఎవరి ఊళ్ళలో వాళ్ళే అమ్ముకోవాలన్నారు. ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేస్తుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పనులు కూడా కొనసాగుతాయి. ఎక్కువ మంది ఉండే చోట శానిటైజ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. లాక్ డౌన్ సమయంలో రోడ్లపై పోలీసులు, కలెక్టర్లే కన్పించారు. మరి ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారు. కొంత మంది మంత్రులు మినహా అందరూ రోడ్లపైకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో 150 మంది కార్పొరేటర్లు పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రజలకు సహకరించాలన్నారు. అమెరికా లాంటి దేశమే ఆర్మీనే దించింది. ఇప్పటి వరకూ పోలీసులు సున్నితంగా చెప్పారు. ఇక దండం బయటకు తీస్తారు.

తెలంగాణలో చాలా గ్రామాలు కంచెలు వేసుకున్నాయి. ఇది మంచి పరిణామం. డాక్టర్లను కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. పోలీసు డిపార్ట్ మెంట్ కూడా చాలా కీలకం. వాళ్లు కూడా ఎగ్జాస్ట్ కాకుండా చూసుకోవాలి. మనిషికి మనిషికి మూడు అడుగుల దూరం మెయింటెన్ చేయాలి ఈ నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటూ మొత్తం రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. వాహనదారులు ఆగకపోతే పెట్రోలు బంక్ లు బంద్ చేయాల్సి వస్తది. ఇది మాకు ఏమైనా సంతోషమా?. రాష్ట్రానికి వందల కోట్ల నష్టం వస్తుంది. ఆదాయం కోల్పోతున్నాం. అయినా సరే ప్రజల కోసం భరిస్తూ ముందుకెళుతున్నాం.. ఆరోగ్య శాఖ, పోలీసు శాఖకు ఎప్పటికప్పుడు నిధులు ఇవ్వమని చెప్పాం. దయచేసి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. ఈ సమస్య ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు. మీడియాకు ప్రభుత్వమే అనుమతించింది. పోలీసులు మీడియా విషయంలో సంయమనం పాటించాలి. మంగళవారం నాడు కరోనా సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కెసీఆర్ తర్వాత కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.

Next Story
Share it