బెల్లంకొండకు జోడీగా అను ఇమ్మాన్యుయల్
BY Telugu Gateway1 March 2020 12:47 PM IST

X
Telugu Gateway1 March 2020 12:47 PM IST
అను ఇమ్మాన్యుయల్. టాలీవుడ్ లోని పలు సినిమాల్లో హంగామా చేసిన ఈ భామ చాలా కాలంగా తెలుగు తెరకు దూరం అయ్యారు. ఛాన్స్ లు రాకో...ఇతర భాషల్లో బిజీగా ఉండో తెలియదు కానీ...టాలీవుడ్ లో కన్పించక మాత్రం కన్పించక చాలా రోజులైంది. కాకపోతే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో సందడి చేయటానికి రెడీ అయింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇఫ్పటికే షూటింగ్ లో కూడా పాల్గొంటోంది.
అను ఇమ్మాన్యుయల్ తెలుగులో చేసిన చివరి సినిమా ‘శైలజారెడ్డి’ అల్లుడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నభా నటేష్ కూడా ఓ హీరోయిన్ గా ఉంది. ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story



