Telugu Gateway
Politics

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్
X

బిజెపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమించింది. దూకుడుగా ఉండే సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించటం ద్వారా రాబోయే రోజుల్లో బిజెపి తెలంగాణలో తన వైఖరి ఎలా ఉండబోతుందో స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా అధిష్టానం మాత్రం సంజయ్ వైపు మొగ్గుచూపింది.

ప్రస్తుత అధ్యక్షుడు కె. లక్ష్మణ్ నుంచి సంజయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బండి సంజయ్ నియామకం విషయంలో సామాజిక కోణాన్ని కూడా పరిశీలించినట్లు చెబుతున్నారు. ఇటీవలే అధిష్టానం తెలంగాణలో 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తన సత్తా చాటాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా సత్తా చాటలేకపోయింది. మరి సంజయ్ తెలంగాణ బిజెపి ఎంత వరకూ విజయతీరాలకు చేరుస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it