బాలకృష్ణ న్యూ లుక్
BY Telugu Gateway21 March 2020 2:31 PM GMT
X
Telugu Gateway21 March 2020 2:31 PM GMT
బాలకృష్ణ ఎప్పటికప్పుడు న్యూ లుక్స్ తో అభిమానులను ఆలరిస్తుంటాడు. రూలర్ సినిమాలో రకరకాల లుక్స్ తో ఆకట్టుకున్న ఈ హీరో...బోయపాటి సినిమా కోసం కొత్త లుక్ లో కన్పించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన న్యూ స్టిల్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. గతానికి భిన్నంగా తెల్ల జుట్టుతోనే ఈ హీరో దర్శనం ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
కొత్త సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ వారణాసిలో ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వారణాసి నుంచి తిరిగొచ్చారు. అంజలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.
Next Story