సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కారు

స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వైరస్ కారణంతో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదావేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ కు కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ముందు చెప్పినట్లుగానే సర్కారు సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లలిత్.. మంగళవారం నాడు రెగ్యులర్ లిస్ట్ లో కేసును విచారణకు ఉంచాలని సూచించారు. అంతకు ముందు స్థానిక ఎన్నికలను వెంటనే జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో సైతం ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తాండవ యోగేష్, జనార్ధన్ అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు.