ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు
BY Telugu Gateway31 March 2020 9:58 PM IST

X
Telugu Gateway31 March 2020 9:58 PM IST
ఏపీలో కూడా కరోనా కేసుల ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 15 కరోనా పాజిటివ్ కేసులు రాగా..సాయంత్రం కొత్తగా మరో నాలుగు కేసులు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే ఏపీలో 19 కరోనా కేసులు నమోదు అయినట్లు అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. కొత్తగా నమోదు అయిన నాలుగు కేసులూ విశాఖపట్నానికి చెందిన వారే. వీరంతా ఢిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నారు.
Next Story



