Telugu Gateway
Andhra Pradesh

తెలుగు మీడియాలో మరో కలకలం

తెలుగు మీడియాలో మరో కలకలం
X

ఓ ఛానల్ ఛైర్మన్ బేలతనం..నా వల్ల కాదు తప్పుకుంటున్నా

వాళ్లు నా మాటే వినటం లేదు..అందుకే బయటకు

ఆయన ఓ ఛానల్ ఛైఓ ఛానల్ ఛైర్మన్ బేలతనం..నా వల్ల కాదు తప్పుకుంటున్నార్మన్. అయినా సరే నా కంపెనీ నా చేయి దాటిపోయింది. దాన్ని మార్చటం నా వల్ల కావటం లేదు. అందుకే నేనే తప్పుకుంటున్నా. ఈ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా. ఇదీ అన్నపూర్ణ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీ24x7) ఛానల్ పి. మురళీకృష్ణంరాజు రాసిన లేఖ. ఇది ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో పెద్ద కలకలంగా మారింది. ఆయన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ‘ఏపీ 24x7 న్యూస్ ఛానల్ కు మొదటి నుంచి నేను ఛైర్మన్ గా ఉన్నప్పటికీ కంపెనీలో నా అనుభవాలు,కష్టసుఖాలు వివరించటం తప్ప రోజువారీ ఛానల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేకోలేదు. చేసుకున్నా ఫలితం లేకపోవటం జరిగింది. ఫలితంగా మొదటే కష్టాల్లో ఉన్న మీడియా రంగం ప్రభావం, పరిపాలనా అపరిపక్వత కలసి కంపెనీ అసాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఉదాహరణకు నెలల తరబడి ఎంప్లాయిస్ శాలరీస్ పెండింగ్,ఇతర పేమెంట్స్ ఎక్కువ అవటమే కాకుండా, కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగుల మధ్య వివాదాలు, కొట్లాటలు జరిగి స్థానిక పోలీసు స్టేషన్ వరకూ కంప్లైంట్ వెళ్లే దాకా పరిస్థితి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో నాకున్న అనుభవం దృష్ట్యా , ఎంప్లాయిస్ భవిష్యత్ దృష్ట్యా ఏ రకమైన సూచనలు చేసినా పట్టించుకోకపోవటమే కాకుండా కాకుండా, సంస్థను గాడిలో పెట్టడానికి, సరైన విధానాలతో సంస్థను ముందుకు తీసుకుని వెళ్ళటం లేదని తెలుసుకుని అలాంటి పరిస్థితి వస్తే మీ అదరాభిమానాలు పొగొట్టుకోవటం కంటే ఈ ఛైర్మన్ పోస్టుకు రిజైన్ చేయటం ఉత్తమం అని నిర్ణయం తీసుకుని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విషయం కంపెనీ యాజమాన్యం వారికి చాలా రోజుల క్రితమే లిఖితపూర్వకంగా తెలియజేయటం జరిగింది. అయినప్పటికీ వారి స్వభావంలో ఎలాంటి మార్పు రాకపోవటంవ వల్ల మీ ముందుకు రావటం జరిగింది.తప్పకుండా నా మనవిని స్వీకరించి ఇక ముందు కూడా మీ ఆదరాభిమానాలు నా మీద చూపించగలరని ఆశిస్తున్నట్లు’ పేర్కొన్నారు.

Next Story
Share it