తండ్రి మరణంపై అమృత రియాక్షన్
BY Telugu Gateway8 March 2020 10:54 AM IST

X
Telugu Gateway8 March 2020 10:54 AM IST
‘నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నా. ప్రణయ్ హత్య జరిగిన తర్వాత నుంచి నాన్న నాతో టచ్‌లో లేడు. ప్రణయ్‌ను చంపిన ప్రశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకుంటున్నా’ అని అమృత తెలిపారు. తన తండ్రి మరణవార్తలను టీవీలో చూసిన తర్వాత ఆమె మీడియా ముందు తన అభిప్రాయం తెలిపారు. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు.
శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Next Story



