Telugu Gateway
Cinema

అక్షయ్ కుమార్ సంచలనం..25 కోట్ల విరాళం

అక్షయ్ కుమార్ సంచలనం..25 కోట్ల విరాళం
X

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రియల్ హీరో అన్పించుకున్నారు. కరోనాపై పోరుకు ఆయన 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకూ వ్యక్తిగతంగా ఏ హీరో కూడా ఇంత భారీ మొత్తంలో సాయం ప్రకటించలేదు. ‘ ఇది మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన సమయం. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నా వంతుగా నేను దాచుకున్న మొత్తం నుంచి రూ. 25 కోట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నా. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్థిగా ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’అంటూ అక్షయ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఈ బాలీవుడ్‌ స్టార్‌ హీరో చేసిన గొప్ప పనికి అతని అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Next Story
Share it