Telugu Gateway
Cinema

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ విడుదల

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ విడుదల
X

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా ఏకంగా నలుగురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. వారే రాశీఖన్నా, కేథరిన్‌,ఐశ్వర్య రాజేష్‌, ఈషాబెల్లా. ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ లాంటి ప్రేమకథ చిత్రాన్ని అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ను తెరకెక్కించారు.

‘ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనది ఏమైనా ఉంది అంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామీనే రేపగలవు’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయింది. నలుగురు హీరోయిన్లతో కూడిన సన్నివేశాలతో ట్రైలర్ కట్ చేశారు. ‘మీ అడోళ్ళకు అసలు ఆగదనే..బట్ట కొంటే ఒంటి మీద వేసుడేనా’ అంటూ ఐశ్వర్యా రాజేష్ ను విజయ్ ప్రశ్నించటం..ఆమె వెంటనే సీరియస్ అయిపోవటం ట్రైలర్ లో చూడొచ్చు.

https://www.youtube.com/watch?time_continue=2&v=g8DNVJvE-rE&feature=emb_logo

Next Story
Share it