కేక పుట్టిస్తున్న నాని ‘వి’ టీజర్
నాని 25వ సినిమా ‘వి’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్ర విడుదల చేసింది. ఈ టీజర్ లోని ‘పంచ్ డైలాగులు’ ఆకట్టుకునేలా ఉన్నాయి. నానితోపాటు సుధీర్ బాబు డైలాగ్ లు బాగున్నాయి. ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అప్పుడప్పుడు నాలాంటోడు గుడ్డిగా రూల్స్ బ్రేక్ చేస్తాడు అంతే అంటూ సుధీర్ బాబు డైలాగ్ చెబుతాడు. యూ ఆర్ సైకో..యూ నో థట్ అంటూ నివేదా థామస్ అంటే...నాని సీరియస్ గా అమ్మో..భయమేస్తుంది అంటూ సీరియస్ గా చెబుతాడు.
‘న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయటానికి నేనేమీ నీ ఫ్యాన్ ను కాదురా అని నాని చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది. ఏంట్రా గేమ్స్ ఆడుతున్నావా అంటూ పోలీసు అధికారి పాత్ర పోషించిన సుధీర్ బాబు చెపితే..సోది ఆపు..దమ్ముంటే నన్ను ఆపు అంటూ టీజర్ ను క్లోజ్ చేశారు. ఓవరాల్ గా చూస్తే టీజర్ సినిమాపై ఖచ్చితంగా అంచనాలను పెంచిందనే చెప్పాలి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=UgJvX9-MNGc