Telugu Gateway
Politics

విద్యార్ధి వీసాలపై ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం!

విద్యార్ధి వీసాలపై ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం!
X

‘మా ఉద్యోగాలు మాకే’. తొలి ప్రాధాన్యత అమెరికా వాళ్ళకే’ అంటూ ట్రంప్ ‘లోకల్’ నినాదం ఎత్తుకున్నారు. సక్సెస్ అయ్యారు కూడా. మరోసారి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ట్రంప్ వీసాల విషయంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత పలు వీసాలపై పెట్టిన ఆంక్షలు..నియంత్రణలు భారత ఐటి నిపుణులతో పాటు పలు వర్గాలను ఇబ్బందులకు గురిచేశాయి. ఇప్పుడు ఆయన కన్ను స్టూడెంట్ వీసాలపై పడింది. ఇక నుంచి విద్వార్థి వీసాలకు సంబంధించి నిర్దిష్ట కాల వ్యవధి నిర్ణయించనున్నారు. ఇప్పటిదాకా విద్యార్ధుల డిగ్రీ పూర్తయ్యేదాకా వీసా ఉండేది.

అది పూ ర్తయ్యాక అనుబంధ డిగ్రీ పట్టా సాధించుకునేందుకు పొడిగింపు కూడా ఇచ్చేవారు. ఇకపై అలా కుదరదు. వీసా ప్రారంభ తేదీ-ముగింపు తేదీ అని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొంటారు. ఆ ముగింపు తేదీలోగా ఖచ్చితంగా అమెరికా నుంచి వెనక్కి వచ్చేయాలి. చాలా మంది విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకున్నాక కూడా వేరే వీసాలకు మారకుండా అదే వీసాలపై కొనసాగుతుండడంతో ఈ కొత్త రూల్‌ తెచ్చారు. దీన్ని ఇమిగ్రేషన్‌ ఏజెన్సీలు తప్పుబడుతున్నాయి. చాలా మంది విద్యార్ధులు తమ చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉంది ఉద్యోగాలు పొందటంతోపాటు దానికి అనుగుణంగా నూతన వీసాలు పొందుతూ సెటిల్ అయ్యేవారు. అలాంటి వారికి ఈ నిర్ణయం ఇబ్బందిగా మారబోతుంది.

Next Story
Share it