Telugu Gateway
Cinema

రానా, గోపీచంద్ లతో ‘తేజ సినిమాలు’

రానా, గోపీచంద్ లతో ‘తేజ సినిమాలు’
X

దర్శకుడు తేజ ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి దగ్గుబాటి రానాతో మరొకటి గోపీచంద్ తో చేయనున్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తేజ ఈ రెండు సినిమాలను ప్రకటించారు. ఈ టైటిళ్ళు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో ఒకటి ‘అలివేలు మంగ వెంకట రమణ’. రెండవది రాక్షస రాజు రావణాసురుడు. అయితే ఇందులో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్స్‌ లో ఉంచారు. అయితే రాక్షసరాజు రావణాసురుడు సినిమా రానాతో చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

సో..రెండవ సినిమా ఆటోమేటిగ్గా గోపీచంద్ ఖాతాలోకి వెళుతుంది. అయితే ఆయన అధికారికంగా ప్రకటించే వరకూ ఈ సస్పెన్స్ అలా కొనసాగే అవకాశం ఉంది. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారని సమాచారం. తేజ తాజాగా తెరకెక్కించిన సినిమా ‘సీత’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.

Next Story
Share it